Site icon NTV Telugu

Mega Hero Wedding Update: తన మ్యారేజ్‌పై క్లారిటీ ఇచ్చిన సాయి దుర్గ తేజ్..

Sai Durga Tej

Sai Durga Tej

Mega Hero Wedding Update: సెలబ్రిటీల లైఫ్‌పై.. వారి జీవితంలో జరిగే ముఖ్య ఘట్టాలపై ఎప్పుడూ ఫ్యాన్స్‌కు ఆసక్తి ఉంటుంది.. ఇక, మెగా ఫ్యామిలీకి చెందిన హీరో అయితే.. మరింత క్రేజ్‌ ఉంటుంది.. ఇక, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్.. ఈ యంగ్‌ హీరో పెళ్లి ఎప్పుడు.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ఫ్యాన్స్‌ ఎదురు చూస్తుంగా.. తన మ్యారేజ్‌పై క్లారిటీ ఇచ్చారు సినీ హీరో సాయి ధరమ్‌ తేజ్ అలియాస్ సాయి దుర్గ తేజ్‌. ఇవాళ ఉదయం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న ఆయన.. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం గురించి స్పందించారు..

Read Also: Kartika Masam: కార్తీక మాసం చివరి సోమవారం ఎఫెక్ట్‌.. శివాలయాలకు పోటెత్తిన భక్తులు..

“వచ్చే ఏడాదిలో నా వివాహం జరుగుతుంది,” అని తెలిపారు సాయి దుర్గ తేజ్‌.. నాకు మంచి సినిమాలు, మంచి జీవితం ఇచ్చిన శ్రీవారికి కృతజ్ఞతలు తెలిపేందుకు తిరుమల వచ్చాను. కొత్త సంవత్సరం రాబోతుండగా శ్రీవారి ఆశీస్సులతో ముందుకు సాగాలని కోరుకున్నాను” అని పేర్కొన్నారు. ఇక, తన రాబోయే సినిమా గురించి సాయి దుర్గ తేజ్‌ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది సంబరాల ఏటి గట్టు సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు.. ఈ చిత్రంపై నాకు మంచి నమ్మకం ఉంది అన్నారు.. కాగా, పాన్-ఇండియా సినిమా ‘సంబరాల ఏటి గట్టు’లో నటిస్తున్నారు ఈ మెగా హీరో.. ఈ ప్రాజెక్టు ప్రారంభం నుంచే మంచి క్రేజ్ నెలకొంది. సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో ఈ మూవీ కీలక మలుపుగా భావిస్తున్నారు. దర్శకుడు రోహిత్ కేపీ ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నారు.. ప్రైమ్ షో ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.. ఇప్పటికే ఈ సినిమా గ్లింప్స్‌ను రిలీజ్ కాగా.. ‘అసుర సంధ్యవేళ మొదలైంది.. రాక్షసుల ఆగమనం’ అంటూ చెప్పిన డైలాగ్ గ్లింప్స్‌కే హైలేట్‌గా నిలిచింది.. దీంతో, ఈ సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోయాయి..

Exit mobile version