Site icon NTV Telugu

గోదావరి జిల్లాలకు పిడుగు హెచ్చరిక…

తూర్పుగోదావరి , పశ్చిమగోదావరి జిల్లాలకు పిడుగు హెచ్చరిక జారీ చేసారు విపత్తులశాఖ కమిషనర్ కె.కన్నబాబు. తూర్పుగోదావరి రాజమండ్రి రూరల్, కడియం, కొత్తపేట, ఆత్రేయపురం ,రావులపాలెం, ఆలమూరు, మండపేట, కపీలేశ్వరపురం, కాజులూరు, తాళ్లచెరువు, కాట్రేనికోన, ఐ.పోలవరం, అయినవల్లి, పామర్రు, రామచంద్రాపురంలో పిడుగు పడే అవకాశం ఉంది.

అలాగే పశ్చిమగోదావరి నల్లజేర్ల, తాడేపల్లిగూడెం, కొయ్యలగూడెం, దేవరపల్లి, చాగల్లు, నిడదవోలు, పెంటపాడు, తణుకు, ఉండ్రాజవరం, పేరవల్లి, ఇరగవరం, అత్తిలి, పెనుమంట్ర, ఉంగుటారు మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉంది అని తెలిపారు. కాబట్టి పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండకండి. సురక్షితమైనభ వనాల్లో ఆశ్రయంపొందండి అని ఆయన పేర్కొన్నారు.

Exit mobile version