NTV Telugu Site icon

Crime: రోడ్డుపై గ్యాంగ్ వార్.. భయంతో పరుగులు తీసిన స్థానికులు

Untitled 10

Untitled 10

Vijayawada: చదువుకోకముందు కాకర కాయ.. చదువుకున్నాక కీకరకాయ అన్నట్టుంది కొందరు చదువుకున్న వాళ్ళని చూస్తే. చదువుకున్నారు ఎవరికీ నచ్చిన పని వాళ్ళు చేసుకుంటున్నారు. అంతవరకు బాగానే ఉన్న గ్రూపులు కట్టి సెట్టిల్ మెంట్లు చేస్తూ రౌడీల్లా రెచ్చిపోతున్నారు ఓ ఇద్దరు యువకులు. వివరాలలోకి వెళ్తే.. తోట సందీప్ మరియు మణికంఠ అలియాస్ పండు ఈ ఇద్దరు వ్యక్తులు గతంలో ఓ ప్రజా ప్రతినిధి వద్ద ముఖ్య అనుచరులుగా పనిచేశారు. కాగా అనివార్య కారణాల వల్ల ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీనితో ఇద్దరు విడిపోయారు. అనంతరం సందీప్ రియలెస్టేట్ చేస్తూ చిన్న చిన్న సెట్టిల్ మెంట్స్ చేస్తుంటాడు. కాగా పండు చికెన్ వ్యాపారం చేస్తుంటాడు. అయితే పండు ఎప్పుడు సందీప్ చేసే సెట్టిల్ మెంట్స్ కి అడ్డుపడుతుంటాడు.

Read also:AP Assembly: సభలో మీసాలు మెలేసిన బాలకృష్ణ.. సభలో ఉద్రిక్తత.. అసెంబ్లీ వాయిదా

విజవవాద శివారులో 2 కోట్లు విలువ చేసే స్థలం ఉంది. ఎప్పటిలానే దాని సెట్టిల్ మెంట్ దందా సందీప్ కి వచ్చింది. ఈ నేపథ్యంలో మణికంఠ సందీప్ సెట్టిల్ మెంట్ కి అడ్డుతగిలాడు. ఈ క్రమంలో ఇద్దరు ఒక ఒప్పందానికి రావడానికి హత్యకి రెండు రోజుల క్రితం సమావేశం అయ్యారు. ఈ సమావేశం సంధి కుదర్చక పోగా ఇద్దరి మధ్య గొడవ పెద్దది కావడానికి కారణం అయ్యింది. గొడవ ముగిసాక ఇద్దరు ఇళ్ళకి వెళ్లిపోయారు. కాగా మణికంఠ పైన ఆగ్రహంతో ఉన్న సందీప్ మణికంఠ ఇంటికి వెళ్లి వార్ణింగ్ ఇచ్చాడు. ఈ విషయం తెలిసిన మణికంఠ సందీప్ షాప్ దగరికి వెళ్లి షాపులో ఉన్న సందీప్ అనుచరులను కొట్టాడు. దీనితో ఇద్దరి మధ్య ఫోన్ లో వాగ్వాదం జరిగింది. నీ అంతు చూస్తా అంటే నీ అంతు చూస్తా అంటూ ఇద్దరు ఫోన్ లో సవాళ్లు విసురుకున్నారు. ఎక్కడికి రావాలో చెప్పు ఏ సెంటర్ అయినా ఓకే అంటూ సినిమా లెవెల్ లో ఛాలెంజ్ చేసుకున్నారు.

Read also:Ola Electric IPO: ఐపీవోకు ఓలా ఎలక్ట్రిక్ సన్నాహాలు.. అక్టోబర్లో డ్రాఫ్ట్ పేపర్ దాఖలు చేయనున్న కంపెనీ

అనుకున్నట్టుగానే పడమట నివాస ప్రాంతాల మధ్యకి ఇద్దరు వాళ్ళ వాళ్ళ అనుచరులతో చేరుకున్నారు. కర్రలు, కత్తులు తిప్పుతూ గొడవకి దిగారు ఇరు వర్గాలు. రెండు గ్రూపులు రాళ్లు విసురుకున్నాయి. పెద్ద పెద్ద అరుపులతో గాలిలోకి ఎగురుతున్న రాళ్లతో ఆ ప్రాంతం యుద్ధ కాండగ మారింది. దీనితో అక్కడ ఉన్న స్థానికులు భయంతో పరుగుయ్లు తీశారు. ఈ ఘటనలో కొందరికి తలలు పగిలాయి. తీవ్ర గాయాలు అయ్యాయి. మణికంఠ వర్గానికి చెందినవారు సందీప్ తల పైన మరియు కార్తీక్ అనే సందీప్ అనుచరుని పైన బ్లెడ్ తో దాడి చేసారు. అలానే సందీప్ కత్తితో మణికంఠ పైన దాడి చేసాడు. ఈ ఘటనలో ఇరువర్గాల నాయకులకి కూడా గాయాలు అయ్యాయి. కాగా గాయపడిన సందీప్ మరియు మణికంఠను ఆసుపత్రికి తరలించారు. కాగా సందీప్ చికిత్స పొందుతూ మరణించాడు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు ఒక్కరిపైన ఒకరు కేసులు పెట్టుకున్నారు. కాగా సందీప్ మరణవార్త తెలుసుకున్న అనుచరులు మరియు స్నేహితులు పెద్దఎత్తున ఆసుపత్రికి తరలి వస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి గొడవలు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

Show comments