Site icon NTV Telugu

విరిగిప‌డ్డ కొండ చ‌రియ‌లు.. ఘాట్ రోడ్డు మూసివేత.. !

తిరుమల రెండో ఘాట్ రోడ్డు తాత్కాలికంగా మూసివేసింది టీటీడీ పాలక మండలి. 14వ కిలో మీటర్ వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో తొలగింపు పనులు చేపట్టారు సిబ్బంది. 16 వ కిలో మీటర్ వద్ద భారీ కోతకు గురైంది రోడ్డు. అలాగే…. 14వ కిలో మీటర్ వద్ద కొండచరియలు తొలగింపు పూర్తి అయితే… లింక్ రోడ్డు మీదుగా వాహనాలు మళ్లింపు చేపట్టే అవకాశం ఉండనుంది.

16వ కిలో మీటర్ వద్ద మరమత్తులకు నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక దీనిపై టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పందించారు. 20 సంవత్సరాలలో ఎన్నడు లేని విధంగా గత 15 రోజులుగా వర్షాలు కురిసాయన్నారు. కొండ చరియలు విరిగిపడడంతో నాలుగు ప్రాంతాలలో రోడ్డు పూర్తిగా ధ్వంసం అయ్యాయని తెలిపారు. కొండచరియలు విరిగిపడే ప్రాంతాలను గుర్తించేందుకు ఢిల్లీ నుంచి ఐఐటీ నిపుణులను రప్పిస్తున్నామని స్పష్టం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

Exit mobile version