శివుడికి ఎంతో ప్రీతికరమైన నెల కార్తీకా మాసం. రానున్న కార్తీక మాసోత్సవాల సందర్భంగా శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 5 నుంచి డిసెంబర్ 4 వరకు కార్తీకమాసం సందర్భంగా కార్తీకమాసోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు.
ఈ నేపథ్యంలో స్వామి వారి స్పర్శ దర్శనం నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా రూ.5వేల గర్భాలయ అభిషేకం నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. కార్తీకమాసోత్సవాల సందర్భంగా భక్తులకు ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.