ఏపీలో రాజధానుల రచ్చ సాగుతూనే వుంది. తాజాగా బీజేపీ నేత టీజీ వెంకటేష్ ఏపీ రాజధానుల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నూలును రాజధానిని చేయాలని డిమాండ్ చేశారాయన.పెద్దగాలి వస్తే కేసీఆర్ ఎలా కొట్టుకుపోతారో….కేసీఆర్ పార్టీ కూడా అలాగే కొట్టుకుపోతుందన్నారు మాజీ ఎంపీ, బీజేపీ నేత టీజీ వెంకటేష్. టీఆర్ ఎస్ పార్టీ పేరు మార్చినంత మాత్రాన పార్టీ పైకి రాదన్నారాయన. టీఆర్ ఎస్ పార్టీ బీ ఆర్ ఎస్ గా మార్పు చేయడం మారిపోయే ముందు దీపం వెలిగినట్టు ఉందన్నారు టీజీ వెంకటేష్. కర్నూలును రాజధానిగా ప్రకటించాలన్నారు వెంకటేష్.