NTV Telugu Site icon

West Rayalaseema Mlc Polls: టెన్షన్ పుట్టిస్తున్న పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ కౌంటింగ్

Maxresdefault

Maxresdefault

టెన్షన్ పుట్టిస్తున్న పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ కౌంటింగ్.. | Ntv

పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ కౌంటింగ్ అనుక్షణం టెన్షన్ పుట్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈఎన్నికల ఫలితాలపై ఆసక్తిగా ఉంది. రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 1654 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు 41 మంది అభ్యర్ధుల ఎలిమినేషన్ పూర్తయింది. వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి కి పోలైన ఓట్లు 96,842 కాగా టీడీపీ అభ్యర్ధి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి పోలైన ఓట్లు 95,188గా వున్నాయి.

ఇదిలా ఉంటే.. తుది దశకు చేరింది పశ్చిమ రాయలసీమ నియోజకవర్గ కౌంటింగ్. నరాలు తెగే టెన్షన్ మధ్య రెండు పార్టీలు నేతలు వున్నారు. బీజేపీ, పిడిఎఫ్ లకు పాలైన రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకంగా మారనున్నాయి. వైసీపీ, టిడిపి గెలుపోటములను నిర్దేశించనున్నాయి ఆ ఇద్దరి అభ్యర్థుల ఓట్లు. దీంతో ఏం జరుగుతుందోనని పోలీసులు పూర్తి భద్రతా ఏర్పా్ట్లు చేశారు.