NTV Telugu Site icon

నెల్లూరు కార్పోరేషన్ ఎన్నికలు.. అక్రమాలపై టీడీపీ సీరియస్

ఏపీలో ఎన్నికలు జరగని మునిసిపాలిటీలు, కార్పోరేషన్లు, పంచాయతీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. నెల్లూరు కార్పోరేషన్ ఎన్నికల అక్రమాల పై హైకోర్టును ఆశ్రయించనుంది తెలుగుదేశం పార్టీ. రిటర్నింగ్ అధికారి ఏకపక్ష నిర్ణయాలపై హైకోర్టు కు వెళ్లాలని టీడీపీ నేతలు నిర్ణయించారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి రిటర్నింగ్ అధికారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించడంపై హైకోర్టును ఆశ్రయించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపారు. నామినేషన్ల తిరస్కరణను సీరియస్ గా తీసుకున్న తెలుగుదేశం పార్టీ అధికారుల పక్షపాత వైఖరిపై మండిపడుతోంది. అధికారులు ఎవరినీ వదిలిపెట్టేది లేదంటోంది.

కొంత మంది రిటర్నింగ్ అధికారులు, జిల్లా అధికారులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కనుసన్నల్లో నడుస్తున్నారని తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. నెల్లూరు కార్పోరేషన్ ఎన్నికల్లో టీడీపీ నామినేషన్స్ తిరస్కరించారు. ఆరు డివిజన్లలో అభ్యర్దులు కరువయ్యారు. వైసీపీకి ఏడుకి పైగా కార్పోరేటర్లు ఏకగ్రీవం అయ్యే అవకాశాలున్నాయి. అధికారులు ఏకపక్షంగా వ్యవహరించి టీడీపీ అభ్యర్ధుల నామినేషన్లు తిరస్కరించారని దానిపై న్యాయపోరాటం చేస్తామంటున్నారు టీడీపీ నేతలు