NTV Telugu Site icon

జల వివాదం.. విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు

TS high court

కృష్ణా జలాల వివాదంలో ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా.. ఇప్పుడు రైతులు ఎంట్రీ ఇచ్చారు.. తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు కృష్ణా జిల్లా రైతులు.. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది హైకోర్టు.. జూన్ 28 తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 34ని సవాల్‌ చేవారు రైతులు.. జీవో 34 విడుదల చేసి విద్యుత్‌ ఉత్పత్తికి నీటిని అక్రమంగా తరలిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.. వెంటనే జీవోను కొట్టివేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.. ఈ పిటిషన్‌పై జస్టిస్ రాంచందర్‌రావు బెంచ్ ముందు విచారణ జరిగింది.. అయితే, ఆ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ బెంచ్‌కు బదిలీ చేయాలని తెలంగాణ అడ్వకేట్ జనరల్ కోరారు.. కానీ, జస్టిస్ రాంచందర్‌రావు బెంచ్ విచారించాలని తెలిపారు చీఫ్ జస్టిస్.. దీంతో.. పిటిషన్‌ను విచారించేందుకు రేఫ్యుజ్ చేయాలని కోరారు ఏజీ.. అసలు ఎందుకు విచారించవద్దో చెప్పాలని ఏజీని ప్రశ్నించారు జస్టిస్ రాంచందర్‌రావు.. ఆ తర్వాత జస్టిస్‌ రాంచందర్‌రావు బెంచ్‌ ఎదుట వాదనలు ప్రారంభం కాగా.. విచారణను రేపటికి వాయిదా వేశారు.

అంతర్రాష్ట్ర జల వివాదంపై సుప్రీంకోర్టుకు గానీ, హైకోర్టుకు గానీ.. విచారించే అధికారం లేదని.. ఈ విచారణ తమ పరిధిలో లేదని వ్యాఖ్యానించింది తెలంగాణ హైకోర్టు.. ట్రిబ్యునల్‌కు పూర్తి అధికారులు ఉన్నాయి కదా అని వాఖ్యానించింది.. సెక్షన్ 11.. అంతర్రాష్ట్ర జల వివాదం ప్రకారం ఈ పిటిషన్ అర్హతపై పిటిషనర్లను ప్రశ్నించింది హైకోర్టు.. సుప్రీంకోర్టు 2008లో జల వివాదాల పై ఇచ్చిన తీర్పును చదువుకుని రేపు రావాలని తెలుపుతూ.. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.