Site icon NTV Telugu

Teenage Pregnancies In AP: ఏపీలో పెరుగుతున్న టీనేజ్ ప్రెగ్నెన్సీలు.. సీఎం సొంత నియోజకవర్గంలో మరీ దారుణం!

Pregnancy

Pregnancy

Teenage Pregnancies In AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీనేజీ ప్రెగ్నెన్సీలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. 2025- 26 సంవత్సరానికి సంబంధించి నమోదైన గణాంకాల ప్రకారం, నెల్లూరు, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, బాపట్ల, కర్నూలు జిల్లాల్లో టీనేజీ ప్రెగ్నెన్సీలు 12 శాతానికి మించి నమోదు అయ్యాయి. ఏలూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, సత్యసాయి, నంద్యాల జిల్లాల్లో 10 నుంచి 12 శాతం వరకు టీనేజీ ప్రెగ్నెన్సీలు నమోదు కాగా, చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నట్లు వెల్లడైంది. ఇక, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో 8 నుంచి 10 శాతం మధ్యలో టీనేజీ ప్రెగ్నెన్సీలు నమోదయ్యాయి.

Read Also: Sarvam AI: ఏఐ రంగంలో భారత్ సంచలనం.. చాట్‌జీపీటీ, జెమినీలను వెనక్కి నెట్టిన భారత్ ఏఐ!

అయితే, రాష్ట్రంలో ఒక్క విశాఖపట్నం జిల్లాలో మాత్రమే అత్యల్పంగా 3.98 శాతం టీనేజీ ప్రెగ్నెన్సీలు నమోదు కాగా, మిగిలిన తొమ్మిది జిల్లాల్లో ఓ మాదిరి స్థాయిలో టీనేజీ గర్భధారణలు ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ప్రభుత్వం 2026- 27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రం మొత్తంగా టీనేజీ ప్రెగ్నెన్సీలు 5 శాతానికి మించకూడదని టార్గెట్ గా పెట్టుకుంది. అయితే, ప్రస్తుతం రాష్ట్ర సగటు టీనేజీ ప్రెగ్నెన్సీ రేటు 8.8 శాతంగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో టీనేజీ ప్రెగ్నెన్సీలు అత్యధికంగా 14.9 శాతం నమోదయ్యాయి.

Exit mobile version