Site icon NTV Telugu

తమ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారని ఎస్ఈసీకి టీడీపీ లేఖ…

ఎస్ఈసీకి టీడీపీ లేఖ రాసింది. నామినేషన్ల పరిశీలనలో వైసీపీ ఒత్తిళ్లకు తలొగ్గి చాలా చోట్ల టీడీపీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారని లేఖలో టీడీపీ ఫిర్యాదు చేసింది. నెల్లూరు కార్పోరేషన్ పరిధిలోని 26,5,7,12,40,37,38 డివిజన్లల్లో టీడీపీ అభ్యర్ధుల నామినేషన్లను ఒత్తిళ్ల మేరకు తిరస్కరించారన్నారు టీడీపీ. దాచేపల్లిలో 17వ వార్డుకు నామినేషన్ వేసిన టీడీపీ అభ్యర్ధి నామినేషన్ను ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఒత్తిడితో తిరస్కరించారని టీడీపీ ఫిర్యాదు చేసింది. దాచేపల్లి పదో వార్డులో వైసీపీయేతర అభ్యర్థుల నామినేషన్లను గంప గుత్తగా తిరస్కరించారని ఎస్ఈసీ దృష్టికి తెచ్చింది తెలుగుదేశం. బుచ్చిరెడ్జిపాలెం 2 వార్డులో కూడా టీడీపీ అభ్యర్ధి నామినేషన్ తిరస్కరించారన్న టీడీపీ… కొన్ని చోట్ల ఆర్వోలు నామినేషన్ల నుంచి ఎన్వోసీలను చించేశారంటూ వివరాలు అందచేసింది. ఇక వైసీపీ ఒత్తిడితో నామినేషన్లని తిరస్కరించిన అధికారులపై సత్వరం చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీని కోరిన టీడీపీ… బాధిత అభ్యర్ధులకు న్యాయం జరిగేలా చూడాలని టీడీపీ వినతి చేసింది.

Exit mobile version