తెలుగుదేశం పార్టీలో విషాదం చోటు చేసుకుంది. ఆపార్టీ సీనియర్ నేత, పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుకి అత్యంత సన్నిహితులు బొప్పన రాఘవేంద్రరావు కన్నుమూశారు. విజయవాడలో తెలుగుదేశం జెండా పట్టిన మొట్ట మొదటి కరుడుగట్టిన తెలుగుదేశం వాది బొప్పన. తెలుగుదేశం సైనికుడు గొప్ప నాయకుడు బొప్పన రాఘవేంద్రరావు శనివారం అర్థరాత్రి శివైక్యం పొందారు.
గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. బొప్పన రాఘవేంద్రరావు లాంటి గొప్ప నాయకుడిని కోల్పోవడం తెలుగుదేశం పార్టీకి , ప్రసాదంపాడు గ్రామానికి తీరని లోటు. అలాంటి ఒక్క గొప్ప కమిట్మెంట్ ఉన్న నాయకుడిని కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం అంటున్నారు టీడీపీ నేతలు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ….. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు టీడీపీ నాయకులు.