Site icon NTV Telugu

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన టీడీపీ ఎంపీల బృందం…

కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీడీపీ ఎంపీల బృందం కలిసింది. కేంద్ర ప్రధాన ఎన్నికల సంఘం కమిషనర్ ను టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్ కలిశారు.  తిరుపతి ఉపఎన్నిక ప్రచార సభలో చంద్రబాబు పై రాళ్ల దాడి ఘటనపై ఫిర్యాదు చేసారు. కేంద్ర బలగాల పర్యవేక్షణ లో పోలింగ్ నిర్వహించాలని తెదేపా ఎంపీలు కోరారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని.. అలాగే 2 లక్షల నకిలీ ఓటరు కార్డులు ఉన్నాయని.. రెండు అదనపు గుర్తింపు కార్డులు ఉంటేనే ఓటు వేసే అవకాశం ఇవ్వాలని కోరారు. పోలింగ్ కేంద్రాల్లో  పరిశీలకులను నియమించాలని కోరిన ఎంపీలు. రాష్ట్ర ప్రభుత్వంలో క్రియాశీలంగా ఉన్న వలంటీర్లకు ఎన్నికల ప్రక్రియలో ప్రమేయం లేకండా చూడాలని అడిగారు.

Exit mobile version