Site icon NTV Telugu

Amara Raja: ఫోర్బ్స్ 500 బెస్ట్ ఎంప్లాయ‌ర్స్ జాబితాలో గల్లా కంపెనీ

Amara Raja

Amara Raja

గుంటూరు టీడీపీ లోక్‌సభ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ కుటుంబ ఆధ్వర్యంలోని అమ‌రరాజా గ్రూప్ అంతర్జాతీయ స్థాయిలో స‌త్తా చాటింది. ఈ కంపెనీ తాజాగా ఫోర్బ్స్ జాబితాలో చోటు ద‌క్కించుకుంది. ఈ సందర్భంగా 500 బెస్ట్ ఎంప్లాయ‌ర్స్ జాబితాలో అమరరాజా కంపెనీ నిలిచింది. ఈ విషయాన్ని అమ‌ర‌రాజ గ్రూప్ మంగ‌ళ‌వారం స్వయంగా వెల్లడించింది. ఈ మేర‌కు సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. ప్రజల విలువ తెలిస్తే పోటీలో ముందుంటామ‌న్న విష‌యాన్ని తాము నమ్ముతామ‌ని.. విశ్వాసం, గౌర‌వం అన్నవే ఆ నమ్మకానికి కార‌ణ‌మ‌ని కూడా అమ‌ర‌రాజ గ్రూప్‌ ట్వీట్‌లో తెలిపింది. ఆ దిశ‌గా ప‌య‌నించినందుకే తాము ఫోర్బ్స్ జాబితాలో చోటు ద‌క్కించుకున్నామ‌ని అభిప్రాయపడింది. ఈ న‌మ్మకంతోనే మ‌రింత వృద్ధిని సాధిస్తామ‌ని ఆ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.

కాగా అమరరాజా కంపెనీ చిత్తూరు జిల్లా కేంద్రంగా ఈ సంస్థ కార్యక‌లాపాలు కొనసాగిస్తోంది. ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం కరకంబాడీలో ఉంది. ఈ సంస్థ అమరాన్ పేరుతో బ్యాటరీలు అమ్మడంలో దేశంలోనే రెండో స్థానంలో ఉంది. అటు అమరరాజా బ్యాటరీస్‌ గ్రూప్‌కు చెందిన అమరరాజా పవర్‌ సిస్టమ్స్‌.. దేశంలోనే తొలి గ్రీన్‌ హైడ్రోజన్‌ ఫ్యూయలింగ్‌ స్టేషన్‌ను లేహ్‌, లడాఖ్‌లో ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టును నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌టీపీసీ) నుంచి పొందినట్లు ఇటీవల అమరరాజా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ విక్రమాదిత్య గౌరినేని తెలిపారు.

Exit mobile version