Site icon NTV Telugu

వైసీపీ పాలనలో దళితులకు రక్షణ లేదు :నారా లోకేష్

nara-lokesh

nara-lokesh

వైసీపీ ప్రభుత్వంపై నారా లోకేష్‌ మరోసారి సీరియస్‌ అయ్యారు. వైసీపీ పాలనలో దళితులకు రక్షణ లేదని ఫైర్‌ అయ్యారు నారా లోకేష్. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం గ్రామసభలో సీజేఎఫ్ఎస్ భూములకు సంబంధించి సరైన పత్రాలు లేకున్నా ఆమోదించాలంటూ ఒత్తిడి తెచ్చినా అంగీకరించలేదనే అక్కసుతో దళిత సర్పంచ్ మాచర్ల పై వైసీపీ నేతలు, వాలంటీర్ కలిసి దాడి చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఒళ్లు బలిసి దళితుల పై దాడులు చేస్తున్న వైకాపా నేతలకు బుద్ధి చెప్పాల్సింది పోయి పోలీసులు నిందితులను రక్షించే ప్రయత్నాలు చెయ్యడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ మాచర్ల గారిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు నారా లోకేష్.

Exit mobile version