Site icon NTV Telugu

దేవినేని ఉమకు బెయిల్‌

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కృష్ణా జిల్లా జి.కొండూరు మండలంలో క్వారీ తవ్వకాలపై పరిశీలనకు వెళ్లిన దేవినేని ఉమపై పోలీసులు కేసు నమోదు చేశారు. దేవినేని ఉమపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు హత్యాయత్నం కేసును కూడా నమోదు చేశారు. దీంతో దేవినేని ఉమను ఐదురోజుల క్రితం రాజమండ్రి జైలుకు తరలించారు. తనపై కావాలనే అక్రమంగా కేసులు పెట్టారంటూ దేవినేని ఉమ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది.

Exit mobile version