ఏపీలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. కృష్ణా-గుంటూరు, తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవులు 2025 మార్చితో ముగుస్తాయి. ఈ క్రమంలో.. ఈ రెండు స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది.
Read Also: Wife And Husband Relationship : పొరపాటున కూడా మీ భార్యతో ఈ విషయాలు చెప్పకండి?
తూర్పు గోదావరి-పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్‌ను ప్రకటించింది టీడీపీ. రాజశేఖర్.. ఐ పోలవరం ఎంపీపీగా, జెడ్పిటీసీగా పనిచేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ రూరల్ సీటు ఆశించారు రాజశేఖర్. అయితే.. కాకినాడ రూరల్ నుంచి పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసింది. మరోవైపు.. కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను ప్రకటించింది టీడీపీ. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
Read Also: YS Jagan: లా అండ్ ఆర్డర్‌ను కాపాడలేకపోతున్నారు.. బద్వేల్ ఘటనపై జగన్ ట్వీట్