Vipperla TDP Clash : పోలీస్ స్టేషన్ వద్ద పెట్రోల్‌తో మహిళ హల్‌చల్.. విప్పర్లలో టీడీపీ వర్గపోరు!

  • విప్పర్లలో మరోసారి టీడీపీ వర్గపోరు
  • నామినేషన్ల ఘర్షణపై ఇరు వర్గాల కేసులు
  • రాజీకి ఒత్తిడి చేస్తున్నారంటూ ఆందోళన
  • పెట్రోల్ పోసుకునే యత్నాన్ని అడ్డుకున్న పోలీసులు
Tdp

Tdp

పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం విప్పర్లలో టీడీపీ వర్గ విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. ఇటీవల పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా విప్పర్లలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు.

రాజీకి ఒత్తిడి చేస్తున్నారంటూ ఆందోళన

కేసు విషయంలో రాజీకి రావాలంటూ ఒక వర్గంపై అడిషనల్ ఎస్పీ హనుమంతరావు ద్వారా ఒత్తిడి తీసుకువస్తున్నారంటూ మరో వర్గం ఆందోళనకు దిగింది. పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న ఆ వర్గీయులు, రాజీపడాలని అడిషనల్ ఎస్పీ హనుమంతరావు తమపై ఒత్తిడి తెచ్చారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెట్రోల్ పోసుకున్న మహిళ.. అడ్డుకున్న పోలీసులు

ఈ నిరసనల మధ్య పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. టీడీపీ నేత కోటయ్య సోదరి ఒంటిపై పెట్రోల్ పోసుకునేందుకు ప్రయత్నించడంతో అక్కడ కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ మహిళను అడ్డుకుని, ఆమె వద్ద ఉన్న పెట్రోల్ బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.