టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఏపీలో జిల్లాల పర్యటనలకు రెడీ అవుతున్నారు. 26 జిల్లాలలో ఏడాది పాటు విస్తృత పర్యటనలు చేయాలని ఆయన నిర్ణయించారు. ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాల్లో భాగంగా ప్రతి జిల్లాలోనూ చంద్రబాబు పర్యటించనున్నారు. జిల్లా పర్యటనల్లో ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించనున్నారు. చంద్రబాబు ఒక్కో టూర్ మూడు రోజుల చొప్పున నెలకు రెండు జిల్లా టూర్లు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల మూడో వారం నుంచే చంద్రబాబు జిల్లాల పర్యటనలు ప్రారంభం కానున్నాయి.
Chandra Babu: మున్సిపల్ స్కూళ్ల విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
ఈనెల 15వ తేదీ నుంచి జిల్లా పర్యటనలను షురూ చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ నెల 15,16,17 తేదీల్లో చోడవరం, అనకాపల్లి, చీపురుపల్లి సెగ్మెంట్లల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. మొదటి రోజు బహిరంగ సభ, రెండో రోజు పార్లమెంటులోని 7 అసెంబ్లీ ఇంఛార్జులతో సమీక్షలు, క్యాడరుతో ఆత్మీయ సమావేశాలు, మూడో రోజు వివిధ నియోజకవర్గాల్లో రోడ్ షో ఉండేలా టీడీపీ శ్రేణులు చంద్రబాబు షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నాయి. ఏడాదిలో 80కి పైగా నియోజకవర్గాలు కవర్ అయ్యేలా టీడీపీ అధినేత పర్యటనలు సాగనున్నాయి. అటు జిల్లాల పర్యటనలు, ఇటు కేంద్ర పార్టీ కార్యాలయంలో పార్టీ వ్యవహారాలు సమాంతరంగా సాగేలా షెడ్యూల్ రూపకల్పన చేస్తున్నారు.
