NTV Telugu Site icon

ఏపీలో కాదు ఢిల్లీలో ధర్నా చేయాలి… బాబుకి వైసీపీ ఎమ్మెల్యే కౌంటర్

ఏపీలో రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్ గా సాగుతుంటుంది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా విపక్షాలు ధర్నాలు చేస్తున్నాయి. మంగళవారం ఏపీలోని పెట్రోల్ బంకుల వద్ద టీడీపీ నేతలు ధర్నాలకు పిలుపునిచ్చారు. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు టీడీపీ ధర్నాలపై హాట్ కామెంట్స్ చేశారు. పెట్రోల్ డీజిల్ రేట్లు అంశంలో చంద్రబాబు ధర్నా ఏపీ లో కాదు…జంతర్ మంతర్ దగ్గర చేయాలన్నారు.

దమ్ముంటే బీజేపీ పై ధర్నా చేయాలన్నారు కారుమూరి. తన స్వంత నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీని కూడా గెలిచే దమ్ము చంద్రబాబుకి లేదన్నారు. ఇష్టానుసారంగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచి కేంద్రం 3 లక్షల 45 వేల కోట్లు ప్రజా ధనాన్ని దోచుకుంటోందన్నారు. పార్టీలకతీతంగా పథకాలు ఇస్తున్నాం కాబట్టి అందరూ మాతో కలిసి వస్తున్నారన్నారు. కుప్పం లో గెలవలేక దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. కుప్పంలో ఇల్లు లేదు…కార్యకర్తలు లేరు. ఇంట్లో ఉండలేక బస్సుల్లో రాజకీయాలు చేస్తున్నందుకు చంద్రబాబు సిగ్గుపడాలన్నారు.