Site icon NTV Telugu

ఇలాంటి సీఎం చరిత్రలో లేరు…రారు !

భారతదేశ పరిపాలన వ్యవస్థలో వాలంటీర్ల వ్యవస్థ సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందన్నారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం. శ్రీకాకుళం జిల్లా రాజాంలో వాలంటీర్లకు సేవ పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తో కలిసి పాల్గొన్నారు. దేశంలోనే వాలంటీర్ వ్యవస్థ ఎంతో అద్భుతమైనదని..కానీ కొందరు వాలంటీర్లకు రాజకీయాలు అంటగడగుతున్నారని మండిపడ్డారు. ఎవరేమనుకున్నా వాలంటీర్లు పట్టించుకోనవసరం లేదని..వాలంటీర్లకు తామంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రజల్లో అసంతృప్తి ఒక్క శాతం కూడా ఉండటానికి వీల్లేదు …గో ఎహెడ్ అంటూ వారిలో ఉత్సాహాన్ని నింపారు. కోవిడ్ సమయంలో వాలంటీర్లు చేసిన సేవ చరిత్ర మరిచిపోలేదని… కాదనేవాడు ఎవడైనా దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఉంటే రమ్మనండి అంటూ సవాల్ విసిరారు. వాలంటీర్ వ్యవస్థ వంటి ఆలోచనకు దేశం తలెత్తి చూస్తోందని…అద్భుతమైన ఈ వాలంటీర్ వ్యవస్థను అందరూ గుడ్లప్పగించి చూస్తున్నారన్నారు. అయితే జగన్ లక్ష్యం నీరుగార్చే ప్రయత్నం ఎవరూ చేయొద్దని…భవిష్యత్తులో ఇలాంటి సీఎం చరిత్రలో లేరు…రారు అనే నినాదంతో పని చేద్దామని పిలుపునిచ్చారు.

Exit mobile version