NTV Telugu Site icon

Kethireddy Pedda Reddy: తాడిపత్రిలో జేసీ సోదరులు బిచ్చం ఎత్తుకోవాల్సిందే..!

Kethireddy Pedda Reddy

Kethireddy Pedda Reddy

Kethireddy Pedda Reddy: 2024 ఎన్నికలలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే తాడిపత్రిలో జేసీ సోదరులు బిచ్చమెత్తుకోవాల్సిందేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. తన పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నేను పాదయాత్ర చేస్తుంటే.. జేసీ కరపత్రాలు పంచుతున్నాడని మండిపడ్డారు.. జేసీ సోదరులకు సవాల్ విసురుతున్నాను… నా మీద, నా కుటుంబసభ్యుల మీద అక్రమ కేసులు పెడితే, దానికి మ్యూల్యం మీ ఇంటి నుంచి మొదలు అవుతుందని హెచ్చరించారు.. ఇదే సమయంలో.. 2024 ఎన్నికలలో వ్తెసీపీ గెలిస్తే తాడిపత్రిలో జేసీ బ్రదర్స్‌ బిచ్చమెత్తుకోవాలని వ్యాఖ్యానించారు.. ఇక, జేసీ ప్రభాకర్ రెడ్డి.. తాను రౌడీ అని చెప్పుకుంటున్నాడు… ప్రతి వ్తెసీపీ కార్యకర్త, నాయకుడు కూడా రౌడీలే నంటూ చెప్పుకొచ్చారు.. జేసీ సోదరులపై ఉన్న కేసులపై చర్యలు తీసుకోకపోతే ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తానని ప్రకటించారు తాడిపత్తి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.

Read Also: Errabelli Dayakar Rao : రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు ఐటమ్ సాంగ్ లెక్కనే చూస్తారు

ఇక, పెద్దవడుగూరులో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. లోకేష్ పాదయాత్ర ఇంకా ఎంత మందిని బలి తీసుకుంటుందని ప్రశ్నించారు. పప్పుదినుసులను కూడా గుర్తు పట్టలేని లోకేష్ కూడా విమర్శలు చేస్తున్నాడని ఎద్దేవా చేసిన ఆయన.. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత అసలు జేసీ బ్రదర్స్‌కు లేదన్నారు.. తాడిపత్రిలో రాజకీయం చేయాలంటే కత్తికి కత్తి పట్టాల్సిందేనని హాట్‌ కామెంట్లు చేశారు. మరోవైపు.. చంద్రబాబు ఎక్కడ కాలు పెడితే అక్కడ కరువు వస్తుందని విమర్శలు గుప్పించారు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. కాగా, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేపట్టిన ప్రజా సంక్షేమ పాదయాత్ర ఇవాళ ముగిసింది.. 11 రోజుల పాటు 110 కిలోమీటర్ల మేర పెద్దవడుగూరు మండలంలో ఈ యాత్ర కొనసాగింది.. యాత్ర ముగింపు సభ పెద్దవడుగూరులో నిర్వహించారు.