NTV Telugu Site icon

మనం పోరాటం చేయటం ముఖ్యం: నారా లోకేష్

అనంతపురంలో కొడికొండ చెక్‌పోస్టు వద్ద టీడీపీ కార్యకర్తలు నారాలోకేష్‌ను కలిశారు. ఈ సందర్భంగా నారాలోకేష్‌ వారితో కాసేపు మచ్చటించారు. మనం పోరాటం చేయటమే ముఖ్యమని, ప్రజల మనవైపే ఉన్నారని లోకేష్‌ అన్నారు. చింతపండు మొదలుకొని నూనె, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు. ప్రజలు అన్ని గమనిస్తు న్నారని, త్వరలోనే వైసీపీకి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు వస్తుందన్నారు. ప్రజలతో కలిసి ఉంటూ, ప్రజలకు అండగా నిలబడాలన్నారు.

ధరలపై పోరాటం చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజలు మన వైపే నిలబడుతున్నారన్నారు. కేంద్రం పెట్రోల్‌, డీజీల్‌ ధరలను తగ్గించినా కూడా రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ను తగ్గించక పోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా ధరలు తగ్గించాలన్నారు. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేయాల న్నారు. టీడీపీ అభ్యర్థులను గెలిపించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.