Site icon NTV Telugu

ఏపీ ఆర్ధిక శాఖలో ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్…

ఏపీ ఆర్ధిక శాఖలో ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లు.. ఒక అసిస్టెంట్ సెక్రెటరిని సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఆర్థిక శాఖలో సెక్షన్ ఆఫీసర్లుగా పని చేస్తున్న డి. శ్రీనిబాబు, కే. వర ప్రసాదులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. అసిస్టెంట్ సెక్రెటరీగా పని చేస్తున్న నాగులపాటి వెంకటేశ్వర్లుని కూడా సస్పెండ్ చేసింది ప్రభుత్వం. అయితే ఈ ముగ్గురు ప్రభుత్వ సమాచారం లీక్ చేస్తున్నారని భావించిన ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది. అలాగే అనుమతి లేకుండా హెడ్ క్యార్టర్ విడిచి వెళ్లరాదని స్పష్టం చేసింది.

Exit mobile version