ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ పై ఉద్యోగ సంఘాల నేతలు విముఖతతో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఉద్యోగ సంఘాల నేతలు ఏకతాటిపైకి వచ్చి పీఆర్సీ సాధన సమితి గా ఏర్పడి సమ్మెకు సిద్ధమయ్యారు. ఉద్యోగ సంఘాల నేతలను బుజ్జగించేందుకు మంత్రులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు రావాలంటూ ఆహ్వానించినప్పటికీ ఉద్యోగ సంఘాల నేతలు చర్చకు రావడం లేదు మంత్రుల కమిటీ వెల్లడిస్తోంది. ఈ సందర్భంగా పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి సూర్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగుల్లో ఐక్యత తెచ్చిన ప్రభుత్వం వితండవాదం వైఖరికి ధన్యవాదాలు అన్నారు.
అశుతోష్ మిశ్ర నివేదిక ఇవ్వడానికి ప్రభుత్వం ఎందుకు ఇబ్బంది పడుతుందో అర్థం కావడం లేదని, సంప్రదింపుల కమిటీ సినిమాటిక్ విధానాన్ని కట్టిపెట్టాలని, సమస్య పరిష్కారానికి సిద్ధం కావాలని ఆయన అన్నారు. ఇప్పటికే కొన్ని ట్రేడ్ యూనియన్లు సమ్మె నోటీసు ఇచ్చామని పీఆర్సీ సాధన సమితి ప్రతినిధిలే చర్చకు రావడం లేదని మమ్మల్ని తప్పు పడుతున్నారని ఆయన మండిపడ్డారు అంతేకాకుండా ప్రభుత్వంపై నమ్మకం లేదు అందుకే మేము చర్చలకు వెళ్లడం లేదని ఆయన స్పష్టం చేశారు. గతంలో 11 దఫాలుగా చర్చలను చాయ్ పే చర్చ అన్న తరహాలో హాస్యాస్పదం చేసిందని, పీఆర్సీ సాధన సమితి నేతలు చర్చకు వచ్చే వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని ఆయన అన్నారు.