నగరి ఎమ్మెల్యే నుంచి మంత్రి స్థాయికి ఎదిగిన ఆర్ కె రోజా బిజీబిజీగా మారిపోయారు. రోజుకో జిల్లాలో పర్యటిస్తూ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అప్పుడప్పుడూ ఆటల పోటీల్లో పాల్గొంటున్నారు. మంత్రి రోజా సెల్వమణికి వింత అనుభవం ఎదురైంది. అది కూడా తన స్వంత నియోజకవర్గంలో ఆ అనుభవం ఎదురుకావడంతో ఆమె అవాక్కయ్యారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. ఏపీలో గడపగడపకు YCP కార్యక్రమంలో భాగంగా మంత్రి రోజా చిత్తూరు – నగరిలో పర్యటించారు. ఈక్రమంలో ఆమె ఓ వృద్ధుడితో మాట్లాడారు. మీకు ఫించన్ వస్తుందా? లేదా? అని అడిగారు. తనకు నెలనెలా ఫించన్ వస్తుందని ఆ వృద్ధుడు చెప్పుకొచ్చాడు. అంతవరకూ బాగానే వుంది కానీ అతనో వింత కోరిక కోరాడు. అది విన్న మంత్రి రోజా ముసిముసినవ్వులు నవ్వడం కనిపించింది. పింఛన్ సరే.. తాను ఒంటరిగా ఉన్నందున తనకు పెళ్లికూతురుని చూడాలని కోరాడు.
ఆయన విన్నపం విన్న రోజా నవ్వేశారు. ‘ఫించను అయితే ఇవ్వగలం కానీ పెళ్లి ఎక్కడి నుంచి చేస్తాం’ అంటూ సమాధానం ఇచ్చారు. ఈ వీడియో నెట్టింట్లో వైరలవుతోంది. మంత్రి అయ్యాక ఆమెకు ఇలాంటి అనుభవం ఎదురైంది. ఈ వయసులో అతనికి అమ్మాయిని చూసి పెళ్ళిచేయడం సాధ్యమేనా? ఇలాంటి వారి కోసం జగన్ ఓ పథకం ఆలోచిస్తే బాగుంటుందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
