NTR District: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. ఈ దాడిలో చంద్రబాబు వ్యక్తిగత భద్రతా అధికారి మధుబాబుకు గాయాలయ్యాయి. దీంతో ఆయన బుగ్గ వెంట రక్తం కారింది. వైద్యులు వెంటనే స్పందించి ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. మరోవైపు ఇదే ఘటనలో చంద్రబాబు పీఎస్‌వోకు కూడా స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. సదరు వ్యక్తి రాయి విసిరిన సమయంలో విద్యుత్ కోత నెలకొంది. కరెంట్ సరఫరా నిలిచిపోవడాన్ని అవకాశంగా భావించి ఈ రాళ్ల దాడికి పాల్పడినట్లు సమాచారం అందుతోంది. కాగా పోలీసుల భద్రత సరిగా లేకపోవడం వల్లే ఈ దాడి జరిగిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ రౌడీలకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
https://www.youtube.com/watch?v=rho3DpK4hxo
