ఆర్థిక ఇబ్బందుల్లో వున్న ఏపీకి కరోనా అదనపు భారంగా మారుతోందన్నారు ఆర్ధిక శాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్. కరోనా సమయంలో చాలా రాష్ట్రాలు సంక్షేమానికి కోత వేశాయి. కానీ ఏపీలో సంక్షేమం ద్వారా పేదలకు నగదు పంపిణీ చేశాం. సీఎం జగన్ అధికారంలోకి రాగానే 27 శాతం ఐఆర్ ప్రకటించారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో ఐఆర్ ఇవ్వలేదు.. ఇదో చరిత్ర అన్నారు.
కానీ ఇప్పుడు కోవిడ్ కారణంగా ఆదాయాలు పడిపోయాయి. రాజధానిని కోల్పోవడం వల్ల 2015-2020 వరకు రూ. 1.80 లక్షల కోట్లు నష్టం వచ్చిందని రావత్. తెలంగాణ జెన్కో నుంచి రూ. 6284 కోట్లు బకాయిలు రావాల్సి ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య అన్ డివైడ్ లోన్ రూ. 33478 కోట్లు ఉన్నాయి.కరోనా వల్ల రూ. 21,933 కోట్లు రెవెన్యూ నష్టం సంభవించిందన్నారు. కోవిడ్ కారణంగా అదనపు ఖర్చు రూ. 30 వేల కోట్లకు చేరిందన్నారు. పీఆర్సీ ప్రకటించిన తర్వాత ఐఆర్ మొత్తం నుంచి అడ్జస్ట్ చేస్తామని ఐఆర్ ప్రకటిస్తూ ఇచ్చిన జీవోలోనే స్పష్టంగా చెప్పామని రావత్ వివరించారు.
అధ్యయనం తర్వాతే నిర్ణయం: శశిభూషణ్, జీఏడీ ముఖ్య కార్యదర్శి
పూర్తి స్థాయిలో అధ్యయనం తర్వాతే అధికారుల కమిటీ 14.29 శాతం రికమెండ్ చేసింది. ప్రభుత్వం మాత్రం 23 శాతం ఫిట్మెంట్ ప్రకటించింది. సీపీసీ ప్రకారం హెచ్చార్ఏ స్లాబులు ఇవ్వాలని నిర్ణయించాం.సీసీఏ కూడా రద్దు చేశాం.పీఆర్సీ అంటే ఫిట్మెంట్, హెచ్చార్ఏనే కాదు.. చాలా కాంపోనెంట్లు ఉంటాయి.కొన్ని కాంపోనెంట్లల్లో తగ్గాయి.. కొన్నింటిలో పెరిగాయి.
హెచ్చార్ఏను కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకారం ఫాలో అవుతున్నాయి.యూపీ, గుజరాత్, రాజస్థాన్, ఒడిషా, మధ్య ప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాలు సీపీసీనే ఫాలో అవుతున్నాయి.ఐఏఎస్ అధికారులకున్న రూ. 40 వేల స్లాబును తొలగించాం.పీఆర్సీ ఇంపాక్ట్ ఏపీ ప్రభుత్వంపై రూ. 10,247 కోట్ల భారం పడుతుంది.గ్రాస్ పే ఎక్కడా తగ్గదు..?అన్నారు శశిభూషణ్.
