NTV Telugu Site icon

Minister Atchannaidu: టెక్కలి ఆస్పత్రిలో మంత్రి అచ్చెన్నాయుడు ఆకస్మిక తనిఖీలు.. తీవ్ర అసహనం..

Atchannaidu

Atchannaidu

Minister Atchannaidu: శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి జిల్లా ఆస్పత్రి పనితీరుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. టెక్కలి జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా పరిశీలించిన ఇయన.. ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.. అయితే, ఆస్పత్రిలో లిఫ్ట్ పనిచేయకపోవడం, రోగులు పడుతున్న ఇబ్బందులను చూసి అసహనం వ్యక్తం చేశారు.. తక్షణమే లిఫ్ట్ మరమ్మతులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. ఎన్నిసార్లు హెచ్చరించినా వైద్యులు.. సిబ్బంది తీరులో మార్పు రాలేదంటూ అహసహనం వ్యక్తం చేశారు మంత్రి అచ్చెన్నాయుడు.. కాగా, మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తోన్న విషయం విదితమే.. గతంలో టీడీపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఆయనే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా పనిచేస్తున్న విషయం తెలిసిందే.

Read Also: Kapil Show Season 2: బాలీవుడ్ షోకు తెలుగు స్టార్ హీరో.. భారత స్టార్ క్రికెటర్స్ కూడా!

Show comments