Madakasira: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో పెళ్లికి వచ్చి మృత్యువాత పడ్డారు ఇద్దరు యువకులు. కర్ణాటక రాష్ట్రం హాసన్ జిల్లాకు చెందిన బాబా జాన్, మున్నా అనే ఇద్దరు యువకులు కుటుంబ సభ్యులతో కలిసి మడకశిర పట్టణానికి పెళ్లికి వచ్చారు. పట్టణ శివారు ప్రాంతంలోని స్విమ్మింగ్ పూల్‌లో సరదాగా ఈతకు వెళ్లారు. ఎంత సేపటికి వారు బయటకు రాకపోవడంతో అనుమానం కలిగిన కుటుంబ సభ్యులు వారిని వెతికారు. స్విమ్మింగ్ పూల్‌లోనే ఇద్దరూ అచేతన స్థితిలో పడి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టినప్పటికీ, వారిద్దరూ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. ఇక, ఈ ఘటనతో సందడిగా ఉన్న పెళ్లి వేడుక కాస్త విషాదంగా మారిపోయింది. అయితే, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Madakasira: పెళ్లికి వచ్చిన ఇద్దరు యువకులు స్విమ్మింగ్ పూల్‌లో మృతి.. ఎలానో తెలుసా..?
- మడకశిరలో పెళ్లికి వచ్చి మృత్యువాత పడిన ఇద్దరు యువకులు..
- స్విమ్మింగ్ పూల్‌లో సరదాగా ఈతకు వెళ్లి చనిపోయిన ఇద్దరు..
- ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్న పోలీసులు..

Madakasira