Site icon NTV Telugu

CM Chandrababu: సత్యసాయి సిద్ధాంతాన్ని అందరూ అర్థం చేసుకోవాలి

Babu

Babu

CM Chandrababu: సత్యసాయి సిద్ధాంతాన్ని అందరూ అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పుట్టపర్తిలో సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు, ఆయన సేవా సిద్ధాంతాలను విశేషంగా అభినందించారు. ప్రపంచం చూసిన ప్రత్యక్ష దైవం, ప్రేమ, సేవలకు ప్రతిరూపం శ్రీ సత్యసాయి బాబా. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం ప్రకటించారు. సత్యసాయి బాబా జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

Read Also: Andhra King Taluka: ఇది నా వ్యక్తిగత చిత్రం – రామ్ ఎమోషనల్ స్పీచ్ వైరల్

సత్యసాయి బాబా వ్యక్తిత్వంలో ఒక అసాధారణ ఆకర్షణ ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. నాస్తికులని కూడా ఆధ్యాత్మికత వైపు మళ్లించే శక్తి ఆయనలో ఉందని అన్నారు చంద్రబాబు.. “మానవ సేవే మాధవ సేవ” అనే బాబా సిద్ధాంతమే ప్రపంచానికి నిజమైన సందేశమని సీఎం అన్నారు. సత్యసాయి బాబా ఒకటో తరగతి నుండి పీహెచ్‌డీ వరకు పూర్తిగా ఉచితంగా విద్య అందించి లక్షల్లో విద్యార్థుల భవిష్యత్తును మలిచారని చంద్రబాబు గుర్తుచేశారు. కేవలం ఆధ్యాత్మికతకే పరిమితం కాకుండా, ఆస్పత్రులు, నీటి ప్రాజెక్టులు, సేవా సంస్థలు ద్వారా వేలాది మందికి ప్రాణాధారం అయ్యారని తెలిపారు. భక్తులపై అపారమైన ప్రేమ చూపిన సత్యసాయి బాబా, వారిని ఎల్లప్పుడూ “బంగారూ” అని పిలిచేవారని సీఎం గుర్తుచేశారు. అది ఆయన హృదయపూర్వక ప్రేమకు ప్రతీక అని వ్యాఖ్యానించారు. “సత్యసాయి సిద్ధాంతం అందరూ అర్థం చేసుకోవాలి” సూచించారు.. ప్రపంచమంతా ప్రేమను పంచారు.. విదేశాలకు వెళ్తే చాలా మంది ఆయన గురించి చెబుతారని తెలిపారు.. 1600 గ్రామాల్లో 30 లక్షల మందికి తాగునీరు అందించారిన గుర్తించారు.. ఏకంగా 102 విద్యాలయాలు నెలకొల్పారు.. ఎన్నో వైద్యాలయాలు స్థాపించారని.. ఏకంగా 140 దేశాల్లో 200 కేంద్రాల్లో సత్యసాయి ట్రస్ట్‌ సేవలందిస్తోందని తెలిపారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..

Exit mobile version