NTV Telugu Site icon

Kethireddy Venkatarami Reddy: ధర్మవరం చెరువు కబ్జా..! మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కుటుంబానికి నోటీసులు..

Kethireddy

Kethireddy

Kethireddy Venkatarami Reddy: శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం చెరువు కబ్జా వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కుటుంబానికి షాక్‌ ఇచ్చారు అధికారులు.. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తమ్ముడు భార్య వసుమతికి నీటిపారుదల శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు.. ధర్మవరం చెరువును కబ్జా చేశారని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తమ్ముడు భార్య వసుమతికి నోటీసులు జారీ చేసినట్టుగా చెబుతున్నారు.. అయితే, చెరువు స్థలాన్ని వెంటనే ఖాళీ చేయాలని ఆ నోటీసుల్లో ప్రస్తావించారు నీటిపారుదలశాఖ అధికారులు… కబ్జా చేసిన చెరువు స్థలాన్ని ఏడు రోజుల్లో ఖాళీ చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు అధికారులు..

Read Also: JK Assembly: ఆర్టికల్ 370 అంశంపై మళ్లీ గందరగోళం.. అసెంబ్లీలో ఎమ్మెల్యేల మధ్య తోపులాట

Show comments