Nandamuri Balakrishna: శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం మార్పుపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. శ్రీ సత్య సాయి జిల్లా కేంద్రంగా పుట్టపర్తి కాకుండా హిందూపురాన్ని జిల్లా హెడ్ క్వార్టర్ గా చేయాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు బాలయ్య.. ఈ రోజు తన నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు.. స్వయంగా టిఫిన్ వడ్డించారు.. ఆ తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీబిజీగా గడిపారు.. అయితే, ఈ పర్యటనలోనే ఆయన హిందూపురంను జిల్లా కేంద్రంగా మార్చాలనే ప్రతిపాదనలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్టు వెల్లడించారు.. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.. అంతేకాదు.. సత్యసాయి జిల్లా పేరులో ఎలాంటి మార్పు చేయకుండా.. జిల్లా హెడ్ క్వార్టర్ ను హిందూపురం చేయాలంటూ గతంలోనే బాలకృష్ణ ఆందోళన చేపట్టిన విషయం విదితమే.. తాజాగా బాలకృష్ణ వ్యాఖ్యలతో మరోసారి సత్యసాయి జిల్లా కేంద్రం మార్పు తప్పదా? అనే చర్చ నడుస్తోంది.
Read Also: Mahesh Babu: అరాచకం.. ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసిన మహేశ్ బాబు..
కాగా, శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లా… జిల్లాల పునర్వ్యవస్థీకరణ భాగంగా 2022లో పాత అనంతపురం జిల్లాలో నుండి ఈ జిల్లా ఏర్పడింది. జిల్లా కేంద్రం పుట్టపర్తిగా నిర్ణయించారు.. అయితే, శ్రీ సత్య సాయి జిల్లాలో పెద్ద పట్టణంగా హిందూపురం ఉంది.. దాంతో.. అప్పటి నుంచి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నందమూరి బాలకృష్ణ.. హిందూపురంను శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ వినిపిస్తూ వస్తున్నారు. మరి, ఇప్పుడు ప్రభుత్వం కూడా మారడంతో అటువైపు అడుగులు పడతాయేమో చూడాలి.