Somireddy Chandramohan Reddy: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్‌ను హైదరాబాద్‌తో అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు విజయవాడకు తరలించారు.. అయితే, వల్లభనేని వంశీ అరెస్ట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన క్రూరమృగం వల్లభనేని వంశీ అని మండిపడిన ఆయన.. వంశీ తల్లి, చెల్లి కూడా ఈ మృగాన్ని శిక్షిస్తేనే సమాజానికి మంచదని అనుకుంటున్నారని పేర్కొన్నారు.. వంశీతో పాటు మరో నాలుగైదు జంతువులు కూడా ఊచలు లెక్కపెట్టి తీరాలి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..
Read Also: RCB Captain: ఆర్సీబీకి కొత్త కెప్టెన్.. అస్సలు ఊహించలేరు!
ఇక, అరెస్ట్ సమయంలోనూ వంశీ డ్రామాలాడాడు.. డ్రెస్ మార్చుకుని వస్తానని గదిలోకి వెళ్లి అందరికీ ఫోన్లు చేసి అల్లర్లు చేయాలని రెచ్చగొట్టాడు అని ఆరోపించారు సోమిరెడ్డి.. తాను మనిషి జన్మ ఎత్తలేదన్నట్లు వంశీ వాగిన వాగుడు అందరికీ గుర్తుందని మండిపడ్డారు.. ఏం పీకుతారంటూ ఎగిరెగిరి పడి ఎన్నికల ఫలితాల రోజు మొదటి రౌండ్ కే పారిపోయిన పిరికిపంద వంశీ అని దుయ్యబట్టారు.. శాశ్వతంగా విదేశాల్లో స్థిరపడేందుకు కూడా ప్రయత్నాలు చేయలేదా ? అని ప్రశ్నించారు.. చేసిన ఒక తప్పు కప్పి పుచ్చుకోవటానికి వందల తప్పులు చేయటం వైసీపీ నేతల నైజం అంటూ విమర్శించారు.. వంశీని ఇన్నాళ్లు ఎలా ఉపేక్షించారో అర్ధం కావట్లేదు.. రాయలసీమలో అయితే వ్యవహారం ఇంకోలా ఉండేది.. వంశీ ప్రవర్తనను ఖండించకపోగా వైసీపీ సీనియర్లు సమర్ధించడం దురదృష్టకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. ఇక, మీడియా సమావేశంలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యల కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..