ఆంధ్రప్రదేశ్‌లో నాటుసారా స్థావరాలపై ఉక్కుపాదం మోపుతోంది స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ)… రాష్ట్రవ్యాప్తంగా గత 16 రోజుల్లో భారీ ఎత్తున నాటుసారా స్థావరాలపై ఎస్‌ఈబీ దాడులు చేస్తోంది.. ఆపరేషన్ పరివర్తన్-2.0లో భాగంగా నాటు సారా స్థావరాలపై దాడులు కొనసాగిస్తుంది.. రాష్ట్ర వ్యాప్తంగా 3,403 నాటుసారా కేసుల నమోదు చేసిన అధికారులు, 2,066 మందిని అరెస్ట్ చేసినట్టు చెబుతున్నారు.. ఇక, 44 వేల లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకోగా.. 155 వాహనాలను సీజ్ చేసింది ఎస్‌ఈబీ.. 16 లక్షల లీటర్లపై బెల్లపు ఊటను కూడా ధ్వంసం చేసినట్టు చెబుతున్నారు.. మొత్తంగా 17 మందిపై పీడీ యాక్ట్ ప్రకారం కేసుల నమోదు కాగా.. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదు పీడీ యాక్టుల కింద కేసుల నమోదు చేసినట్టు పేర్కొన్నారు.
Read Also: Viral: మొత్తం రూ.1 నాణాలే.. రూ.2.6 లక్షల బైక్ కొనేశాడు..
ఆపరేషన్ పరివర్తన్ పేరుతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఓసారి స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది.. బెల్లం సరఫరాదారుల నుంచి నాటు సారా కాస్తున్న వారి వరకూ ఎవ్వరినీ వదలకుండా బైండోవర్ కేసులు నమోదు చేసింది.. సారా సరఫరాదారులపై పీడీ చట్టాన్ని ప్రయోగించింది.. రాష్ట్రంలో మద్యం షాపులు తగ్గించిన ప్రభుత్వం ధరలు కూడా పెంచడంతో.. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తీసుకొస్తున్న ముఠాలు కొన్నైతే.. రాష్ట్రం లోపలే అడవులు, వాగులు, వంకల్లో నాటుసారా కాచేవారి సంఖ్య కూడా పెరిగిపోయినట్టు తెలుస్తోంది.. దీంతో, అప్రమత్తమైన ఎస్‌ఈబీ ఎక్కడికక్కడ సిబ్బందితో నాటుసారా స్థావరాలపై దాడులు చేస్తూ తయారీదారులకు సంకెళ్లు వేస్తున్న విషయం తెలిసిందే.
