AP Assembly: ఎథిక్స్ కమిటీ ముందుకు టీడీపీ ఎమ్మెల్యేల వ్యవహారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఓ వైపు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల ఆందోళనలు, మరోవైపు సస్పెన్షన్లు కొనసాగుతూనే ఉన్నాయి.. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి ఇది నడుస్తూనే ఉంది.. అయితే, టీడీపీ సభ్యుల వ్యవహార శైలి ఎథిక్స్ కమిటీ ముందుకు చేరింది.. సభలో టీడీపీ సభ్యుల వ్యవహారాల శైలిని పరిశీలించి.. తగిన చర్యలు సూచించనుంది ఎథిక్స్ కమిటీ.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం.
Read Also: Ukraine Russia War: మీడియాపై పుతిన్ ఆంక్షలు..
Also Read
- AP Panchayat Elections: పల్లెపోరులో ఏకగ్రీవాల జోరు.. రెండో విడతలో భారీ సంఖ్యలో ఏకగ్రీవాలు
- VijayaSai Reddy: ఉగాది తర్వాత పాదయాత్ర.. విజయసాయి రెడ్డి కీలక ప్రకటన
- Off The Record: 'ఎవర్రా వీళ్లంతా..?' అంటూ జనసైనికుల ఫైర్
- CM Chandrababu: గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు.. రేషన్ షాపుల్లో తక్కువ ధరకే కందిపప్పు, పామాయిల్..
కాగా, గత కొద్ది రోజులుగా కల్తీ సారా మరణాలపై అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఆందోళన, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. స్పీకర్ పోడియం దగ్గర బైఠాయించటం, స్పీకర్ పై కాగితాలు చించి వేయటం, ఈలలు వేయటం, చిడతలు తెచ్చి రభస, బల్లలు చేరుస్తూ సభను అడ్డుకునే ప్రయత్నం చేయడం లాంటి కార్యక్రమాలు చేశారని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది… ఈ నేపథ్యంలో.. సభ్యుల వ్యవహార శైలిపై ఎథిక్స్ కమిటీ విచారణ జరపనుంది.. అసెంబ్లీకి సంబంధించిన వీడియో ఫూటేజ్‌ను కూడా పరిశీలించనుంది ఎథిక్స్ కమిటీ.. టీడీపీ సభ్యుల వ్యవహార శైలిని ఎథిక్స్ కమిటీకి స్పీకర్ తమ్మినేని.. రిఫర్ చేయడంతో.. ఎథిక్స్ కమిటీ విచారణ, సూచించే చర్యలపై ఉత్కంఠ నెలకొంది.
- Tags
తాజావార్తలు
-
Telangana ACB: ఏసీబీ అధికారులపై లంచం ఆరోపణలు..!
-
AP Panchayat Elections: పల్లెపోరులో ఏకగ్రీవాల జోరు.. రెండో విడతలో భారీ సంఖ్యలో ఏకగ్రీవాలు
-
BCCI: సిరాజ్‌ను తుది జట్టు నుంచి ఎందుకు తప్పించారు? మౌనం వీడిన బీసీసీఐ
-
OTR : కేటీఆర్ పాదయాత్ర ఎప్పటి నుంచి మొదలవుతుంది..?
-
OTR : ఏపీ స్థానిక ఎన్నికల్లో నెక్స్ట్ లెవెల్ ఫైట్
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!