NTV Telugu Site icon

Somu Veerraju on Srisailam: జగన్ జోక్యం చేసుకోవాలని లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. రజాక్ చక్రవ్యూహంలో శ్రీ శైలం పుణ్యక్షేత్రం విలవిలలాడుతోందన్నారు. సీఎం జగన్ వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు. శ్రీశైలం మహాపుణ్యక్షేత్రానికి రజాక్ అనే వ్యక్తి ఒక శాపగ్రస్తంలా తయారయ్యాడు.అతని అరాచకాలను ఎదిరిస్తే పదులు సంఖ్యలో కేసులు పెట్టించడం ద్వారా అక్కడి వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు.జరిగిన సంఘటనలను ఎదిరించి హైందవ ధర్మానికి అండగా ఉన్న బీజేపీ నేత బుడ్డా శ్రీ కాంత్ రెడ్డి పై కేసులు బనాయించారు.రజాక్ కు అక్కడి ఎమ్మెల్యే అండగా ఉండడంతో పోలీస్, రెవిన్యూ, దేవాదాయ శాఖ అధికారులు రజాక్ చెప్పినట్టే చేస్తున్నారు.

శ్రీశైలంలో భారత రాజ్యాంగానికి చోటు లేని విధంగా రజాక్ ఆగడాలు కొనసాగుతున్నాయి.ఆలయాల దర్శన యాత్రలో నేనే స్వయంగా ఈ విషయాలను తెలుసుకుని బాహ్యప్రపంచానికి తెలియ చేశాను.స్థానిక అధికారులు రజాక్ ఆగడాలకు అడ్డు వేయలేక పోతున్నందునే ఈ విషయాలను మీ ముందుకు ఈ లేఖ ద్వారా తీసుకుని వస్తున్నా అన్నారు సోము వీర్రాజు.

బీజేపీ నేత బుడ్డా శ్రీకాంత్ రెడ్డి పై శ్రీశైలం ఆలయానికి సంబంధించిన కేసులన్నీ కూడా తప్పడు కేసులే.కేవలం రజాక్ ఆగడాలును అడ్డుకున్నందుకు అక్కడి అధికారులు రజాక్ చెప్పుచేతల్లో ఉండి కేసులు బనాయించారు.పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్ బుడ్డా శ్రీకాంత్ రెడ్డి పై కేసులు ఏవిధంగా బనాయిస్తారు..?ఒక డాక్టరుపై పదుల సంఖ్యలో కేసులు పెట్టడానికి మీ ప్రభుత్వానికి సిగ్గు అనిపించడంలేదా..?ఇప్పటికైనా బుడ్డా శ్రీకాంత్ పెట్టిన కేసులు కూడా ప్రభుత్వం ద్వారా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతున్నా అన్నారు బీజేపీ నేత సోము వీర్రాజు .