Site icon NTV Telugu

Somu Veerraju : మేం పోలవరం పూర్తి చేస్తాం.. మిగిలిన ప్రాజెక్ట్‌లు వైసీపీ ప్రభుత్వం

విజయనగరం జిల్లా వంగర మండలం మడ్డువలస ప్రాజెక్ట్‌ వద్ద బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజుతో పాటు ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. పోలవరం కోసం రోజూ ముఖ్యమంత్రి వెళ్లి 55 వేల కోట్లు ఇచ్చేయండి అంటూ మోర పెట్టుకుంటున్నారని, ముఖ్యమంత్రికి ఉత్తరాంద్రా ప్రాజెక్ట్‌లు గుర్తుండటంలేదా అని ఆయన మండిపడ్డారు. సీఎం జగన్ కి దమ్ము, ధైర్యం, ప్రేమ ఉంటే ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలని, మేం పోలవరం పూర్తి చేస్తాం … మిగిలిన ప్రాజెక్ట్‌లు వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయాలని సవాల్‌ విసిరారు. క్షేమం చేస్తానంటున్న జగన్ కి రోడ్లు వేయడం కూడా తెలీదని, సంక్షేమం పేరుతో ఆంధ్రప్రదేశ్ ని జగన్‌ అదోగతి పాలు చేస్తున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్రలో సాగు, త్రాగు నీరు లేని కారణంగా వలసలు పోతున్నారన్నారు. నేతలకు నిజంగా చిత్తశుద్ది లేదని, కోట్లు కోట్లు తినేస్తున్నారు, మట్టి, ఇసుక అమ్ముకుంటున్నారు కానీ కనీసం ప్రాజెక్ట్‌లను మెంటెనెన్స్ చేయడంలేదని ఆయన ఆరోపించారు.

Exit mobile version