NTV Telugu Site icon

సోమశిల డ్యామ్‌ సురక్షితంగా ఉంది.. టెన్షన్‌ వద్దు : జాయింట్ కలెక్టర్‌

మొన్నటి వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు ఏపీని కుదిపేశాయి. ఈ నేపథ్యంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని చెరువులకు గండిపడిపోవడంతో గ్రామాల్లోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే నెల్లూరు జిల్లాలోని సోమశిల డ్యామ్‌ తెగిపోతుందని ఆకతాయిలు వదంతులు సృష్టించారు. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా కొందరు గ్రామాలను వదిలివెళ్లేందుకు సిద్ధమయ్యారు.

దీంతో అధికారులు అలర్ట్‌ అయిన అధికారులు సొమశిల డ్యామ్‌ సురక్షితంగా ఉందని వదంతులు నమ్మి ఆందోళన చెందవద్దని జాయింట్‌ కలెక్టర్‌ వెల్లడించారు. అంతేకాకుండా వదంతులు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అసత్య ప్రచారాలు చేస్తే క్రిమినల్‌ కేసులు పెడుతామని పోలీసులు కూడా ప్రకటించారు.