Site icon NTV Telugu

జగన్ పాపాలు పండాయి.. ప్రజలు తిరగబడతారు : సోమిరెడ్డి

సీఎం జగన్ పాపాలు పండాయి.. ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి అన్నారు. పార్టీ కార్యాలయంపై వైసీపీ నేతలు, కార్యకర్తలే దాడి చేశారంటూ తమ వద్దనున్న సాక్ష్యాలను విడుదల చేసింది టీడీపీ. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ… గంజాయి గురించి విమర్శిస్తే వారినే బొక్కలో వేసే పరిస్థితి వస్తోందని… ప్రభుత్వాధినేత అయిన జగన్.. రాజ్యాంగాధినేతగా ప్రకటించుకున్నారని మండిపడ్డారు. జగన్ రాసుకున్న రాజ్యాంగంలో అలా ఉందేమో..? తనను తిట్టారు కాబట్టి.. కొట్టండి అని పోలీస్ మీట్లో సీఎం జగన్ ప్రకటించారని చురకలు అంటించారు.

ఏపీలో బాధితులే ముద్దాయిలుగా మారిపోతున్నారని… పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిని ఎందుకు అరెస్ట్ చేయరు..? అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కారును పార్టీ కార్యాలయంపై దాడికి వినియోగించారని… వైసీపీ నేత జోగరాజు, వైసీపీ కార్పోరేటర్ అరవ సత్యం, అప్పిరెడ్డి పానుగంటి చైతన్య, రోషన్ షైక్ వంటి వారు దాడిలో పాల్గొన్నారని ఆరోపించారు. పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిని డీఎస్పీ దగ్గరుండి కారెక్కించి పంపిస్తున్నారని ఫైర్‌ అయ్యారు. వైసీపీ కి ప్రజలు త్వరలోనే బుద్ది చెబుతారని హెచ్చరించారు.

Exit mobile version