చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే ఏపీ పుననిర్మాణం జరిగిందని తెలిపారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. ఆ తర్వాతే రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగుల వేస్తుందన్నారు.. కానీ, జగన్ పాలనా వల్ల రాష్ట్రం అప్పులపాలైందని విమర్శించారు. అయితే, ప్రస్తుతం సీట్లు గురించి చర్చే అవసరం లేదు.. ముందు జగన్ పరిపాలనకు చమరగీతం పాడాలన్నారు.. వైసీపీ అధికారంలోకి వచ్చిక సీఎం జగన్ ఏపీని వ్యాపారం కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు.
Read Also: Sarkaru Vaari Paata: మహేష్ బాబుకు జగన్ సర్కార్ తీపి కబురు
సగటు ఏపీ పౌరుడు తలదించుకునే విధంగా జగన్ పరిపాలన ఉందన్నారు సోమిరెడ్డి.. అన్నపూర్ణ లాంటి ఆంధ్రను అపకీర్తిపాలు చేశారని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం, ఎమ్మెల్యే సీట్లు కాకుండా అందరూ ఏపీ భవిష్యత్తుకోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. కాగా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు పొత్తుల వ్యవహారం హాట్ టాపిక్‌గా నడుస్తోంది.. టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలతో మరోసారి ఎన్నికల పొత్తులపై చర్చ మొదలైంది.