దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికల సందడి నెలకొంది. విపక్షాలు ఉమ్మడి అభ్యర్థి కోసం అన్వేషణ సాగిస్తున్నాయి. ఎన్డీయే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాలని టీడీపీ డిమాండ్ చేసింది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ, యూపీఏ పక్షాలు అభ్యర్థి కోసం పాకులాడుతున్నాయి.. తపన పడుతన్నాయి.
చేతిలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును ఉంచుకుని వేరే వారిని వెతుక్కోవడం దేనికి..? ఉప రాష్ట్రపతులు.. రాష్ట్రపతులు అయిన సంప్రదాయం మన దేశంలో ఉంది. వెంకయ్యనాయుడుది మచ్చ లేని జీవితం. రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు పేరును ఎన్డీఏ ప్రకటించాలన్నారు. వెంకయ్య నాయుడు రాష్ట్రపతి అభ్యర్థి అయితే అన్ని పార్టీలూ సహకరిస్తాయి. రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడును నిలబెడితే ఏకగ్రీవం అవుతుంది.
రాష్ట్రపతి ఎన్నికలను ఇంతగా వివాదాస్పదం చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాలు రోజుకో పేరును ప్రతిపాదిస్తాయి.. వాళ్లేమో మేం పోటీ చేయం అంటారు. వెంకయ్యనాయుడును ఏకగ్రీవంగా ఎన్నుకుంటే దేశ గౌరవం మరింత పెరుగుతుందన్నా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
KTR: కిషన్ కు కేటీఆర్ సవాల్.. కంటోన్మెంట్‌లో ఫ్లై ఓవర్‌లు కట్టించే దమ్ముందా?
