ఇవాళ సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఈ సూర్యగ్రహణం మంగళవారం సాయంత్రం 5.01 నుండి సాయంత్రం 6.26 నిమిషాల వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు. గ్రహణం సమయంలో అందరూ ఇంట్లోనే ఉండాలి. ఏ విధమైన ఆహారం తీసుకోకూడదు. తులసి ఆకులపై నీటిపై ఉంచితే సూర్య గ్రహణ ప్రభావం తగ్గుతుంది. గ్రహణం వేళ మీ ఇళ్లలోని ఆహార పదార్థాలు, నీళ్లలో గరికను వేయాలి. గ్రహణం సమయంలో గర్బిణులు ఆహారం తీసుకోకూడదు. బయటకు కూడా రాకూడదు. గ్రహణం సమయంలో కుర్చీలో లేదా సోఫాలో ప్రశాంతంగా కూర్చొని ఏదైనా పుస్తకం చదవాలి. బయటకు రాకూడదు. గ్రహణాన్ని ఎవ్వరూ నేరుగా చూడకూడదు. అలా చేస్తే కంటి చూపు మీద ప్రభావం వుంటుంది.