NTV Telugu Site icon

Sister Sacrifice: చెరువులో మునిగిపోయిన చెల్లిని కాపాడి.. అక్క ప్రాణ త్యాగం

Swim Death

Swim Death

నీటిలో ప్రమాదాలు కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. ఎక్కడో చోట ఈతకు వెళ్ళి మృత్యువాత పడుతున్న సందర్భాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నీటిలో మునుగుతున్న చెల్లిని కాపాడిన అక్క ప్రాణ త్యాగం చేసింది. చెరువులో పడిన తన చెల్లిని రక్షించి , అక్క మృత్యువాత పడిన ఘటన శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం కాసిరాజు కాశీపురంలో చోటుచేసుకుంది. నందిగాం మండలం కాశీరాజు కాశీపురం గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామ సమీపంలో ఉన్న చెరువులో సవర తులసమ్మ తన ఇద్దరు కుమార్తెలు జాహ్నవి, హారిక లతో కలిసి బట్టలు ఉతికేందుకు వెళ్లింది.

Read ALso: Rajasthan: దళిత మహిళపై రోజుల తరబడి సామూహిక అత్యాచారం, నిందితుల్లో పూజారి

తులసమ్మ బట్టలు ఉతుకుతుండగా చిన్న కుమార్తె జాహ్నవి చెరువులో దిగిన విషయాన్ని గమనించిన పెద్ద అక్క నీటిలో దూకింది. అప్పటికే చెల్లి మునిగిపోవడం గమనించింది. చెల్లిని కాపాడి జాహ్నవి నీటిలో మునిగిపోతుండగా గమనించిన తల్లి హారికను కాపాడేందుకు నీటిలో దూకింది. తల్లి కూతుర్లు నీటిలో మునిగిపోతుండగా గమనించిన తులసమ్మ భర్త నీటిలో దూకి కాపాడే ప్రయత్నంలో తులసమ్మ మాత్రమే ప్రాణాలతో మిగిలింది. అప్పటికే నీట మునిగి ఊపిరాడక హారిక (13) మృత్యువాత పడింది. హారిక బందపల్లి ఆశ్రమ పాఠశాలలో చదువుతుంది. విషయం తెలుసుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెల్లిని కాపాడే ప్రయత్నంలో అక్క చేసిన త్యాగాన్ని గ్రామస్తులు కొనియాడుతున్నారు. ఒక కూతురు మరణించడంతో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.