Site icon NTV Telugu

Anakapalle Girl Missing: యువతి మిస్సింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. అసలు కారణం ఇదే!

Girl Missing Case

Girl Missing Case

Shocking Twist In Anakapalle Girl Sunkara Priyanka Missing Case: అనకాపల్లిలో సంచలనం సృష్టించిన యువతి మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. ఆమె అదృశ్యం వెనుక ప్రేమ వ్యవహారమే కారణం అయ్యుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎక్కడా ఆచూకీ లభ్యం కాకపోవడం, ఫోన్ కూడా స్విచ్చాఫ్ వస్తుండటంతో.. కచ్ఛితంగా ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. యలమంచిలి ప్రాంతానికి చెందిన సుంకర ప్రియాంక (19) ఇంటర్ సెకండియర్ చదువుతోంది. జిరాక్స్ షాప్‌కి వెళ్తున్నానని చెప్పి, ఆ అమ్మాయి బయటకు వెళ్లింది. అంతే, మళ్లీ తిరిగి ఇంటికి రాలేదు. సమయం గడిచిపోతున్నా, ప్రియాంక ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఏమైనా ప్రమాదం జరిగిందేమోనని అనుకొని, ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంత వెతికినా, ఆమె జాడ కనిపించలేదు. స్నేహితుల ఇంటికి వెళ్లిందేమోనని అందరినీ సంప్రదించారు. కానీ.. ఎవరి ఇంటికి వెళ్లలేదని తెలిసింది.

Hyderabad News: మద్యం మత్తులో యువకుడి వీరంగం.. నడి రోడ్డుపైనే యువతిని వివస్త్రను చేసి..!

దీంతో.. భయభ్రాంతులకు గురైన ప్రియాంక తండ్రి శ్రీనివాసరావు వెంటనే పోలీసుల్ని ఆశ్రయించారు. జిరాక్స్ షాప్‌కి వెళ్తున్నానని చెప్పి తమ కూతురు బయటకు వెళ్లిందని, అప్పటి నుంచి ఇంటికి తిరిగి రాలేదని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. ప్రేమ వ్యవహారం కోణంలోనూ విచారణ చేపట్టారు. ఆమెకు సన్నిహితంగా ఉన్న వాళ్లను ఆరా తీస్తున్నారు. ఎక్కడా ఆచూకీ లభ్యం కాలేదు కాబట్టి.. ప్రేమ వ్యవహారమే అయ్యుండొచ్చని, ప్రేమించిన వ్యక్తితో ఆమె వెళ్లిపోయి ఉండొచ్చని పోలీసులు అనుకుంటున్నారు. ఆ కోణంలోనే దర్యాప్తు చేపట్టారు.

Srikalahasti Video Record: శ్రీకాళహస్తిలో దారుణం.. భక్తురాలు స్నానం చేస్తుండగా వీడియో రికార్డ్

Exit mobile version