NTV Telugu Site icon

ఆర్టీసీ బస్సు ప్రమాదం.. వెలుగులోకి షాకింగ్‌ నిజాలు..!

పశ్చిమగోదావరి జిల్లాలో ఆర్టీసీ బస్సు ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.. జంగారెడ్డిగూడెం సమీపంలో డివైడర్‌ను ఢీ కొన్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి జల్లేరు వాగులో పడిపోయింది.. అశ్వారావుపేట నుండి జంగారెడ్డి గూడెం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకోగా.. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ చిన్నారావు, తొమ్మిది మంది ప్రయాణికులు సహా మొత్తం 10 మంది మృతిచెందారు.. మరికొందరి పరిస్ధితి విషమంగా ఉంది.. అయితే, ఆ ప్రమాదానికి సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి..

Read Also: ఒమిక్రాన్‌ టెన్షన్‌.. హాట్‌ స్పాట్‌గా టోలిచౌకి పారామౌంట్ కాలనీ..!

ప్రమాదంలో గాయపడిన సోమశేఖర్ (డ్రైవర్‌ పక్క సీటులో కూర్చున్న వ్యక్తి) నిజాలను బయటపెట్టాడు.. బస్సు స్టీరింగ్ పట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని.. డ్రైవర్ ఎంత ట్రై చేసినా స్టీరింగ్ తిరగలేదని తెలిపాడు.. స్టీరింగ్ పట్టడంతో ఒక వైపు బస్సు వెళ్లిపోయిందన్న ప్రత్యక్షసాక్షి.. బస్సు మెయింటినెన్స్ సరిగా లేదు.. గతంలో కూడా ఈ బస్సుకి స్టీరింగ్ పట్టినట్టు చెబుతున్నారని.. ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, జల్లేరు వద్ద బ్రిడ్జిపై రేలింగ్‌ లేకపోవడం కూడా ఈ ప్రమాదానికి కారణంగా తెలిపాడు సోమశేఖర్.