Site icon NTV Telugu

Cold Waves: తెలుగు రాష్ట్రాల్లో బెంబేలెత్తిస్తున్న చలి..

Cold

Cold

Cold Waves: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఇళ్ల నుంచి జనం బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో లేని విధంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కేవలం ఉదయం పూట మాత్రమే కాదు.. రాత్రి సమయాల్లో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా 4.5 నుంచి 11.2 డిగ్రీల సెల్సియస్ మధ్య అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. సంగారెడ్డిలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. 10 ఏళ్ల రికార్డు స్థాయిలో చలి ప్రజలను బెంబేలెత్తిస్తోంది.

Read Also: BMW : ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టికెట్ రేట్లు విషయంలో..మాస్ రాజా షాకింగ్ నిర్ణయం

అయితే, ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ లో కూడా గడ్డ కట్టించే చలి ఉంటుంది. ఖమ్మం, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట్ మినహా మిగిలిన జిల్లాల్లో 10 డిగ్రీల లోపు, హైదరాబాద్‌లో 10 డిగ్రీలు, మహాబూబ్‌నగర్‌లో 5.4, మెదక్‌లో 5.4, వికారాబాద్‌లో 8. 2 ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ప్రతి చోటా సాధారణం కంటే అతి తక్కువ సెల్సియస్ నమోదు అవుతున్నాయి. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆది, సోమవారాల్లో చలి తీవ్రత అధికంగా ఉండబోతుందని హెచ్చరించారు.

Read Also: Power Star : ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ లో ‘OG పార్ట్ 2’

ఇక, ఆంధ్రప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యల్పంగా 5 డిగ్రీల లోపు సెల్పియస్ నమోదు అవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంత ప్రజలు చలి తీవ్రతను ఎదుర్కొంటున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులో రాష్ట్రంలోనే అత్యంత అల్పంగా 3.5 కంటే తక్కువ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పార్వతీపురం మన్యం, చిత్తూరు, కాకినాడ, ఎన్టీఆర్, నంద్యాల, ఏలూరు, అనకాపల్లి, విజయనగరం, శ్రీసత్యసాయి, శ్రీకాకుళం, కర్నూలు, అన్నమయ్య, అనంతపురం జిల్లాల్లో 10 డిగ్రీల లోపే రికార్డు అవుతున్నాయి.

Exit mobile version