శ్రీకాకుళం జిల్లాలో తాజాగా ఏడు బ్లాక్ ఫంగస్ కేసులు గుర్తించాం అని శ్రీకాకుళం.జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. రిమ్స్ లో స్పెషల్ వార్డులో చికిత్స అందిస్తున్నాం. తీవ్రత ఎక్కువ ఉన్నవారికి మాత్రమే యాంపోటెరిసిన్ వాడుతున్నాం. బ్లాక్ ఫంగస్ ట్రీట్ మెంట్ కు కావాల్సిన మెడిసిన్ అందుబాటులో ఉంది అన్నారు. అవసరం మేరకు ప్రభుత్వం నుంచి మందులు సప్లై ఉన్నాయి. ఆపరేషన్ అవసరమైతే చికిత్స చేయించేందుకు నిపుణులతో మాట్లాడుతున్నాం. అందుకు కావాల్సిన ఏర్పాట్లు రిమ్స్ , జెమ్స్ లో చేస్తున్నాం అని పేర్కొన్నారు.