Sensational Truths Revealed In Anakapalle Mahalakshmi Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన విశాఖ ప్రేమోన్మాది కేసులో తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతురాలు మహాలక్ష్మి ఒంటిపై 16 కత్తి పోట్లు ఉన్నట్లు గుర్తించారు. శ్రీనివాస్ ఆమెను లాడ్జికి తీసుకువెళ్లి.. విచక్షణారహితంగా ఒంటిపై కత్తితో దాడి చేసినట్లు వెల్లడైంది. పక్కా ప్లాన్ ప్రకారమే నిందితుడు ఈ హత్య చేశాడని తేలింది. ఈ కేసు వివరాల్ని పరవాడ డీఎస్పీ సత్యనారాయణ తెలియజేస్తూ.. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం లాడ్జిలో ఒక రూమ్ నుంచి అనుమానాస్పద స్థితిలో అరుపులు వినిపించాయని తమకు ఫిర్యాదు అందిందన్నారు.
Wrestlers Protest: ఇండియా గేట్ వద్ద రెజ్లర్ల నిరసన..అనుమతించేది లేదన్న ఢిల్లీ పోలీసులు..
తాము వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోగా.. రూమ్‌లో మహాలక్ష్మి అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గమనించామని డీఎస్పీ తెలిపారు. అనంతరం బాత్రూంలో శ్రీనివాస్ గాయాలతో ఉన్నాడని చెప్పారు. ఉద్దేశ్యపూర్వకంగా మహాలక్ష్మిని శ్రీనివాస్ లాడ్జికి పిలిపించి, ఈ హత్య చేసినట్లు తాము గుర్తించామని అన్నారు. లాడ్జి రూమ్‌లో రెండు కత్తులు, కొన్ని మత్తు ఇంజెక్షన్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు. మహాలక్ష్మి పోస్టుమార్టం పూర్తి అయ్యిందని, ఈ కేసులో మహాలక్ష్మికి శ్రీనివాస్ మత్తు ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేశాడా? లేదా? అనేది ఇంకా తెలియాల్సి ఉందని అన్నారు. మహాలక్ష్మి ఒంటిపై 16 కత్తిపోట్లు ఉన్నాయన్నారు. మహాలక్ష్మికి ఉద్యోగం వచ్చిన తర్వాత.. డబ్బుల కోసం శ్రీనివాస్ వేధించేవాడని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని, తాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ వివరించారు.
Khalistan: CBSC సిలబస్ నుంచి “సపరేట్ సిక్కు దేశం” పాఠ్యాంశం తొలగింపు
కాగా.. ఇంటర్ నుంచి ప్రేమించుకుంటున్న మహాలక్ష్మి, శ్రీనివాస్.. కొన్ని నెలల క్రితం రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లి చేసుకున్నారు. అయితే.. పెళ్లి అయ్యాక శ్రీనివాస్ వేధింపులకు గురి చేస్తున్నాడని, మహాలక్ష్మి అతడ్ని దూరం పెట్టింది. ఈ క్రమంలోనే మహాలక్ష్మితో మాట్లాడాలని చెప్పి.. శ్రీనివాస్ లాడ్జికి రప్పించాడు. రూమ్‌లోకి వెళ్లిన అనంతరం శ్రీనివాస్ ఆమెపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు. రూమ్ నుంచి అరుపులు రావడంతో.. లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. తొలుత వీళ్లిద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని అనుకున్నారు. కానీ.. శ్రీనివాస్ పక్కా స్కెచ్‌తో మహాలక్ష్మిని హత్య చేసినట్లు తేలింది.