Site icon NTV Telugu

బిగ్ బ్రేకింగ్ : ఆ వెటకారపు నవ్వే, ఆరుగురిని చంపించింది ?

పెందుర్తి ఆరు హత్యల అంశంలో సంచలన అంశం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అప్పలరాజు పోలీసుల విచారణలో కీలక విషయం బయట పెట్టాడు. ఈరోజు వేకువజామున పాలు తీసుకోవడానికి వెళుతున్న అప్పలరాజును విజయ్ భార్య చూసి వెటకారంగా నవ్వినట్టు చెబుతున్నాడు. విజయ్ భార్యతో పాటు, విజయ్ తండ్రి బమ్మిడి రమణ కూడా అప్పలరాజు ను చూసి వెటకారంగా నవ్వడంతో అవమానంగా భావించిన అప్పలరాజు ఎదురుగా ఉన్న తన ఇంట్లోకి వెళ్లి కత్తి తీసుకు వచ్చి ఇంటి ముందు ముగ్గులు వేస్తున్న విజయ్ భార్యను ముంది నరికి చంపినట్టు సంకాహార్మ.  విజయ్ భార్య కేకలు వేయడంతో బయటకు వచ్చిన విజయ్ తండ్రి రమణ, అప్పలరాజు చేతిలో కత్తి చూసి ఇంట్లోకి పరుగులు పెట్టాడట. దీంతో అతని వెంట పడిన అప్పలరాజు, అడ్డం వచ్చిన విజయ్ అత్త, చిన్న అత్తలను కూడా నరికి చంపాడు. అయితే ఆ సమయంలో చేతిలో పిల్లలు ఉండడంతో వారికి తీవ్ర గాయాలు అయినట్టు పేర్కొన్నాడు. తర్వాత బాత్రూంలో దాక్కున్న బమ్మిడి రమణను సైతం కత్తితో దాడి చేసి చంపానని ఒప్పుకున్నాడు అప్పలరాజు.

Exit mobile version